గతకొంతకాలంగా జరుగుతున్నా ప్రైవేట్ అవార్డు ఈవెంట్ లలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ పేరు వినిపించనందుకు మండిపడ్డ యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులకు మంచి జోష్ ఇచ్చేలా ఫిల్మ్ ఫేర్ మరియు సినీ మా అవార్డు ఫంక్షన్ వాళ్ళు ఎన్టీఆర్ పేరు ని టెంపర్ సినిమాలో అద్బుతమనైన నటనకి గాను అనౌన్స్ చేశారు.
దాంతో ఫ్యాన్స్ సంతోషంగా తమ హీరోకి అవార్డు పక్కా అన్న ధైర్యంతో ఉన్నారు. టెంపర్ సినిమాలో కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చినందుకు ఎన్టీఆర్ కి రియల్ గా అవార్డు ఇవ్వాల్సిందనేది అందరి వాదన. 2015 లో మిగిలిన బెస్ట్ సినిమాలతో టెంపర్ సినిమాను కంపేర్ చేస్తే ఎన్టీఆర్ కే ఆ అవార్డు వస్తుందని అంటున్నారు.
కాగా టెంపర్ సినిమాలో ఎన్టీఆర్ తో పాటు కెరీర్ బెస్ట్ ఇచ్చిన నటుడు మరొకరు ఉన్నారు. ఆయనే పోసాని కృష్ణమురళి. నారాయణమూర్తి పాత్రలో అద్బుతమైన నటనని కనబరిచిన పోసానికి మిగిలిన ప్రైవేట్ అవార్డులలో కూడా బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ అవార్డు వస్తుంది అనుకున్నా ఎవ్వరూ ఇవ్వలేదు.
కానీ ఇప్పుడు ఇద్దరు రెండు అవార్డు ఈవెంట్స్ లో నామినేట్ అవ్వడంతో ఈ ఇద్దరికీ అవార్డు పక్కా అంటున్నారు.