తమిళనాట యంగ్ టైగర్ హవా మొదలు..!!

రెండు వరుస విజయాలు ఎన్టీఆర్ ను స్టార్ హీరో నుండి ఇప్పుడు సూపర్ స్టార్ హీరోని చేశాయి. సోషల్ మీడియాలో ఇప్పుడు ఎన్టీఆర్ బిగ్గెస్ట్ స్టార్ అయ్యాడు. ఇప్పటివరకు తెలుగు వరకే తన మార్కెట్ ఉండగా ఇప్పుడు సౌత్ లోని అన్ని భాషల్లో ఎన్టీఆర్ సినిమా రిలీజ్ కాబోతుంది.



మలయాళంలో భారీ రేటు పలికిన జనతాగ్యారేజ్ కి ఇప్పుడు తమిళ్ లో అంతకుమించిన రేటు దక్కింది. ఇది ఇప్పటివరకు ఎన్టీఆర్ చేసిన సినిమాల్లో బిగ్గెస్ట్ రేటు అని చెప్పొచ్చు. మళయాళ౦లో 4.7 కోట్ల రేటు పలికిన జనతాగ్యారేజ్ కి తమిళ్ లో 10 కోట్ల ఆఫర్ వచ్చిందట.

ఇప్పటివరకు ఎన్టీఆర్ చేసిన సినిమాల్లో శక్తి ఒక్కటి అక్కడ డబ్ అయ్యింది కానీ పెద్దగా ఆకట్టుకోలేదు. కానీ రీసెంట్ గా ఎన్టీఆర్ కి చెన్నైలో ఎలాంటి క్రేజ్ ఉందో తెలియడంతో అక్కడ ఎన్టీఆర్ సినిమాకు ఇంత రేటు దక్కిందని అంటున్నారు. ఇక సినిమా రిలీజ్ అయ్యి పెట్టిన రేటుని వసూల్ చేయడం ఒక్కటే మిగిలింది.