టెంపర్ కి ముందు వరకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని కానీ ఎన్టీఆర్ అభిమానులను గానీ గమనిస్తే తమ ఆరాధ్య హీరో తమకు ఒక్క హిట్ ఇస్తే చాలు అనే ఆశతో ఉండేవారు. కానీ ఎప్పుడైతే ఎన్టీఆర్ తన నుండి అభిమానులు ఏం కావాలో కోరుకున్నారో అప్పటి నుండే తన పంతాని పూర్తిగా మార్చుకున్నాడు.
ఆది-సింహాద్రి తరువాత దాదాపు 13 ఏళ్ళు ఎన్టీఆర్ కి ఇలాంటి క్రేజ్ రావాలి అని అభిమానులు కోరుకున్నారు. ఒకటి తరువాత ఒకటి వరకుసగా రెండు సినిమాలతో ఏకంగా సౌత్ క్రేజీయెస్ట్ హీరోల్లో ఒకడిగా నిలిచిన ఎన్టీఆర్ నుండి అభిమానులు కోరుకునే సింహాద్రి రేంజ్ మాస్ మూవీగా ఇప్పుడు జనతాగ్యారేజ్ ప్రేక్షకులముందుకు రాబోతుంది.
ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్ సోషల్ మీడియాను సునామీలా రెచ్చిపోయి ఆల్ టైం రికార్డు లెవల్ లో ట్రెండ్ అయ్యింది. ఇక లేటెస్ట్ గా చెన్నైలో ఎన్టీఆర్ షూటింగ్ లో కన్నా ఎక్కువగా ఫ్యాన్స్ తోనే గడిపాడు అంటే ఏ రేంజ్ లో ఫాలోయింగ్ పెరిగిందో అర్ధం చేసుకోవచ్చు. దాంతో ఎన్టీఆర్ అభిమానులు ఈ రోజు కోసమే ఎదురుచూస్తున్నామంటూ దుమ్ము రేపుతున్నారు.