మాస్ లో భారీ ఫాలోయింగ్ ఉన్న హీరో నికార్సయిన మాస్ సినిమా చేస్తే ఆ ఇంపాక్ట్ ఎలా ఉంటుందో చూపించడానికి సిద్ధం అవుతున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. తన కెరీర్ లో బిగ్గెస్ట్ మాస్ హిట్ సింహాద్రిని మరిపించడమే ధ్యేయంగా పెట్టుకున్న ఎన్టీఆర్ జనతాగ్యారేజ్ తో ఆ కోరికని తీర్చుకోవాలి అనుకుంటున్నాడు.
ప్రస్తుతం షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ సినిమాలో 70% షూటింగ్ పూర్తి అయిందట. సినిమాలో ఇంకా బ్యాలెన్స్ ఉన్నవల్లా 4 పాటలు మరియు మూడు హై ఓల్టేజ్ ఫైట్ సీన్స్ మాత్రమే నట. ప్రస్తుతం టాకీ పార్ట్ పూర్తి అవ్వడంతో మొదట సాంగ్స్ షూట్ చేయబోతున్నారట.
తరువాత మిగిలిన ఫైట్ సీన్స్ ని షూట్ చేస్తే సినిమాకి గుమ్మడికాయ కొట్టేస్తారని అంటున్నారు. ఈ పనులన్నీ జులై 10 లోపు అయిపోతాయట. జులై మూడో వారంలో సినిమా ఆడియోని రిలీజ్ చేసి ఆగస్టు 12 న వరల్డ్ వైడ్ గా సినిమాను అత్యంత భారీస్థాయిలో రిలీజ్ కాబోతుంది.