10 నిమిషాల డైలాగ్ సింగిల్ టేక్ లో చెప్పిన ఎన్టీఆర్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి ఇండస్ట్రీలో ఒక పేరు ఉంది…ఎంతటి డైలాగ్ అయినా సింగిల్ టేక్ లో చెప్పగల నటుడని అందరూ మెచ్చుకుంటారు. మిగతా హీరోలతో ఎన్టీఆర్ ను వేరు చేసేది ఈ డైలాగ్ డిలివరీతో పాటు ఎంతపెద్ద డైలాగ్స్ అయినా గుర్తుపెట్టుకునే అద్బుతమైన మెమొరీ.
ఈ మెమొరీకి ఎన్టీఆర్ తో పనిచేసే ప్రతీ దర్శకుడు ఫ్లాట్ అవ్వడం ఖాయం. లేటెస్ట్ గా ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం జనతాగ్యారేజ్ షూటింగ్ స్పాట్ లో ఇలాంటిదే జరిగింది. 10 నిమిషాల ఓ పవర్ ఫుల్ స్పీచ్ ని ఎన్టీఆర్ అనర్గలంగా చెప్పేసి అందరికీ షాక్ ఇచ్చాడట.
ఎలాంటి బెరుకు లేకుండా సింగిల్ టెక్ లో 10 నిమిషాలు నాన్ స్టాప్ గా చెప్పిన డైలాగ్ కి యూనిట్ అందరూ ఫ్లాట్ అయిపోయి చప్పట్ల వర్షం కురిపించారట. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమాలో సాంగ్స్ తప్ప దాదాపు టాకీ పార్ట్ మొత్తం పూర్తి అయిందని అంటున్నారు.