Uncategories
1000 మంది అనాధ పిల్లలను చదివిస్తోన్న ఎన్టీఆర్ ఫ్యాన్స్!
1000 మంది అనాధ పిల్లలను చదివిస్తోన్న ఎన్టీఆర్ ఫ్యాన్స్!
1000 మంది అనాధ పిల్లలను చదివిస్తోన్న ఎన్టీఆర్ ఫ్యాన్స్!
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgz3_9EyyWRhMRDw2yGjlrbsKieZBarpaXKY2HioV1VCc1kiCyCtqFNFZXqQNHUOgs6xsyqIihHF6-RtP17Jg3hz9LKq965p4DVGxn8A925IiNRTzN9lFlXdiyXn04r5za9L840DdveNbO5/s320/NTR-FANS-GREATNESS.jpg) |
NTR Fans Greatness |
అభిమానులు తమ హీరోల సినిమాలు రిలీజ్ అయ్యే సమయంలో చేసే హంగామా అంతా ఇంతా కాదు.. కొంత మంది ఫ్యాన్స్ తమ హీరో పటానికి పాలాభిషేకం చేయడం… పూల దండలు వేయడం నుంచి ఇటీవల మేకలను గొర్రెలను బలి ఇవ్వడం వరకూ చేస్తున్నారు. కానీ కొంత మంది అభిమానులు మాత్రం తమ హీరో పేరుతో మంచి పనులు కూడా అదీ సమాజానికి ఉపయోగపడే పనులు చేస్తున్నారు.
బెంగళూరు కు చెందిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులు 1000 మంది అనాధ పిల్లలను దత్త తీసుకుని వారిని చదివిస్తున్నారు. వీరి కోసం అభిమానులు ఓ స్కూల్ ను ఏర్పాటు చేసి త్వరలో ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ స్కూలు ఎన్టీఆర్ చేతుల మీదుగా త్వరలో ప్రారంభం కానున్నది. ఏ హీరో అభిమానులైనా ఇలా సమాజానికి ఉపయోగపడే మంచి పనులు చేస్తే అభినందిచాల్సిందే….. వీరిని స్పూర్తి గా చేసుకొని మరికొంత మంది సమాజానికి మంచి పనులు చేసే విధంగా ముందుకు అడుగు వేయాలని ఆశిద్దాం.