NTR |
ఎన్టీఆర్ నటుడుగానే కాకుండా సింగర్ గా కూడా అభిమానులని మెప్పించాడు. యమ దొంగ సినిమా లో ” ఓలమ్మి తిక్క రేగిందా ” పాట తో గాయకుడి గా మారిన ఎన్టీఆర్ , తొలి పాట తోనే మంచి మార్కులు కొట్టేసాడు.ఆ తర్వాత కంత్రి లో కూడా తన గాత్రం తో ” 1 ..2…3…నేనొక కంత్రి ” అన్నాడు. ఇక అదుర్స్ లో చరి పాట తో ఎన్టీఆర్ సింగర్ గా కూడా కుమ్మేసాడు అనిపించుకున్నాడు. పోయిన ఏడాది రభస లో ” రాకాసి ” పాట పాడి అందర్నీ ఆశ్చర్యపరిచాడు.2014 హిట్ పాటల్లో రాకాసి పాట కూడా చేరిపోయింది. అయితే , తాజా సమాచారం ప్రకారం ఎన్టీఆర్ మరొకసారి పాట పాడటానికి సిద్ధం అయ్యాడట. సంక్రాంతికి రాబోతున్న నాన్నకు ప్రేమతో సినిమా లో ఒక పాట ని ఎన్టీఆర్ తో పాడించాలని దేవి శ్రీ ప్రసాద్ ఫిక్స్ అయ్యాడు. ఇదే విషయాన్నీ ఇటివల కుమారి 21 ఎఫ్ ప్రమోషన్లలో ద్రువికరించాడు.ఎన్టీఆర్ పాట పాడుతున్నాడు అని తెలుసుకున్న అభిమానులు ఆనందోత్సాహాలలో మునిగి తేలుతున్నారు. వచ్చే నెల 3 వారం లో నాన్నకు ప్రేమతో ఆడియో విడుదల అవుతుంది. ఇక అప్పటి వరకు అభిమానులు ఎన్టీఆర్ పాట కోసం ఎదురు చూడాల్సిందే.